Pothina Mahesh : జగన్ అండ్ టీంపై వెబ్ సీరీస్
Pothina Mahesh : ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి జనసేన పార్టీలకు మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంది. సముద్ర ఖని పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన బ్రో ది అవతార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ ను వ్యక్తిగతంగా వెక్కరించారు. ఆపై ఏడు సినిమాలు తీస్తానంటూ టైటిల్స్ కూడా ప్రకటించారు. దీంతో జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. తాము కూడా మూవీస్ తీస్తామంటూ ఆ పార్టీ నేత పోతిన మహేష్(Pothina Mahesh) స్పష్టం చేశారు.
Pothina Mahesh Comments
తాము కూడా రాబోయే ఎన్నికల్లో ఓ వెబ్ సీరీస్ తీయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి టైటిల్స్ కూడా స్పష్టం చేశారు. తల్లి చెల్లి ఒక ఖైదీ నెంబర్ 6093 , డాటర్ ఆఫ్ వివేకా, ఏఎక్స్ఈ, గంజాయి మిస్సైన అమ్మాయి..మధ్యలో ఇసుక దిబ్బలు, కోడి కత్తి సమేత శ్రీను, డ్రైవర్ డోర్ డెలివరీ , అరగంట అద్దె ఇల్లు, ఓ ఖైదీ వదిలిన బాణం, ఆర్జీఎఫ్ పేరుతో వరుసగా వెబ్ సీరీస్ తీస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎవరైనా నటించ వచ్చని స్పష్టం చేశారు. కావాలని అనుకుంటే తనను సంప్రదించ వచ్చని తెలిపారు.
వైసీపీ నేతలు మరోసారి తమను విమర్శించే ముందు ఆలోచించు కోవాలని పోతిన మహేష్ సూచించారు. ఇంకోసారి అవాకులు చెవాకులు పేలితే ఇలాగే కౌంటర్ ఇస్తామన్నారు.
Also Read : Chandrababu Naidu : ప్రాజెక్టుల ఊసెత్తని జగన్