Japan PM Calls : చైనా మిల‌ట‌రీ డ్రిల్స్ పై జ‌పాన్ సీరియ‌స్

వెంట‌నే ఆపేయాలంటూ పిలుపునిచ్చిన ప్ర‌ధాని

Japan PM Calls : ఏక‌ప‌క్షంగా చైనా దూకుడుతో వ్య‌వ‌హ‌రించ‌డాన్ని జ‌పాన్ త‌ప్పు ప‌ట్టింది. అమెరికా స్పీక‌ర్ ప‌ర్య‌ట‌న సాకుతో తైవాన్ పై దాడులు చేయాల‌ని అనుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించింది.

ఇది పూర్తిగా ఆధిప‌త్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శించేలా క‌నిపిస్తోంద‌ని మండిప‌డింది. చైనా మిల‌ట‌రీ డ్రిల్స్ (సైనిక విన్యాసాలు) ను వెంట‌నే నిలిపి వేయాల‌ని కోరింది.

అంతే కాకుండా ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా చైనాకు చెందిన ఐదు బాలిస్టిక్ క్షిప‌ణ‌లు తైవాన్ ప్ర‌త్యేక ఆర్థిక జోన్ లో ప‌డిపోయ్యాయ‌ని దీనికి చైనా పూర్తిగా బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేసింది జ‌పాన్.

వాటిలో నాలుగు తైవాన్ లోని ప్ర‌ధాన ద్వీపం మీదుగా ప్ర‌యాణించిన‌ట్లు టోక్యో(Japan PM Calls) వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా అమెరికా స్పీక‌ర్ నాన్సీ పెలోసీ ఆసియా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇప్ప‌టికే తైవాన్ ను సంద‌ర్శించారు.

తాజాగా ఆమె టోక్యోలో ఉన్నారు. జాతీయ భ‌ద్ర‌త‌, పౌరుల సెక్యూరిటీ చైనా చేప‌ట్టిన సైనిక చ‌ర్య‌, దూకుడు తీవ్రంగా ప్ర‌భావం చూపుతుంద‌ని అన్నారు జ‌పాన్ ప్ర‌ధాన మంత్రి ఫుమియో కిషిడా. చైనా చేప‌ట్టిన చ‌ర్య‌లు అభ్యంత‌క‌ర‌మైన‌వి.

ఈ ప్రాంతంలో అశాంతిని, అంతర్జాతీయ ప‌రంగా ఉద్రిక్త‌త‌ను క‌లుగ చేస్తుంద‌న్నారు. శుక్ర‌వారం నాన్సీ పెలోసీతో ప్ర‌ధాన‌మంత్రి భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

మిల‌ట‌రీ డ్రిల్స్ ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. చైనా అంత‌ర్జాతీయ న్యాయ సూత్రాల‌ను, ఒప్పందాల‌ను పూర్తిగా ఉల్లంఘిస్తోంద‌ని ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా డ్రాగ‌న్ ఎక్క‌డా త‌గ్గడం లేదు. త‌న దూకుడును మ‌రింత పెంచింది.

Also Read : లంక‌లో చైనా నౌక..భార‌త్ ఆందోళ‌న‌

Leave A Reply

Your Email Id will not be published!