S Jai Shankar : త్వరలోనే జపాన్..భారత్ విజన్ విడుదల
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్
S Jai Shankar : త్వరలోనే జపాన్..భారత్ కలిసి తయారు చేసిన విజన్ విడుదల కానుందన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. సుదీర్గ చర్చలు జరిగాయన్నారు.
జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా , ప్రధాన మంత్రి మోదీలు(PM Modi) రూపొందించిన విజన్ త్వరలోనే నెరవేరుతుందన్నారు. భారత్ ను సందర్శించాలని జపాన్ పీఎంను కోరారని తెలిపారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య సమావేశం ముగిసిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్(S Jai Shankar) జపాన్ ప్రధాని పుమియో కిషిడాతో శుక్రవారం సమావేశం అయ్యారు.
ప్రధాని కిషిదా , పీఎం నరేంద్ర మోడీలు రూపొందించిన విజన్ త్వరలో సాకారం కాగలదన్న విశ్వాసాన్ని జై శంకర్ ఆశా భావం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో భారత దేశం , జపాన్ లు విధానాలు , ఆసక్తుల సన్నిహిత సమన్వయం ప్రాముఖ్యతను నొక్కి చెప్పార కేంద్ర మంత్రి. తాను , ప్రధాన మంత్రి మోదీ వ్యక్తం చేసిన దార్శనికత త్వరగా నెరవేరుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు జై శంకర్.
భారత దేశం, జపాన్ ల రక్షణ , విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. పరస్పర ప్రయోజనాలు , ఆందోళనలకు సంబంధించిన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు.
ఇండో పసిఫిక్ , ఉక్రెయిన్ సింగ్ , జై శంకర్ జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రి హయాషి యోషిమాసా , రక్షణ మంత్రి హమదా యసుకాజుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రక్షణ సహకారంలో పురోగతిపై ప్రత్యేకంగా చర్చ జరిగింది.
Also Read : జాతీయ ప్రయోజనాలపై కేంద్రం ఫోకస్