Japanese Anchor : రష్యా దాడులపై జపాన్ యాంకర్ కంటతడి
పుతిన్ పై నిప్పులు చెరిగిన యుమికో మాట్సువో
Japanese Anchor : యావత్ ప్రపంచం ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్దాన్ని ఖండిస్తోంది. బాంబుల మోత మోగిస్తోంది. మిస్సైళ్లను ప్రయోగిస్తోంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు.
ఉక్రెయిన్ ఇప్పుడు దారుణాలకు వేదికగా మారింది. ఇంత జరిగినా రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజ్యకాంక్ష , యుద్దకాండ ఆపడం లేదు. ఇంకెంత కాలం నరమేధం అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజాస్వామిక వాదులు.
రష్యా చేస్తున్న దాడులలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతుండడాన్ని ఐక్య రాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. ఏకంగా ప్రపంచ కోర్టు తప్పు పట్టింది.
ఇక ప్రపంచ వాటికన్ సిటీ పోప్ సైతం యుద్దాన్ని, నరమేధాన్ని, మారణ హోమాన్ని ఆపాలని కోరారు. అవసరమైతే తాను ప్రోటోకాల్ ను వదిలేసి వస్తానని ప్రకటించారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్ లోని బుచా హత్యా కాండ ప్రపంచాన్ని కదిలించి వేసింది. కలిచి వేసింది. కన్నీళ్లు పెట్టించేలా చేసింది. ప్రతి ఒక్కరి హృదయం బద్దలయ్యేలా చేసింది.
ఈ తరుణంలో బుచా హత్యా కాండను పర్యవేక్షించిన సైనికులను రష్యా చీఫ్ పుతిన్ సత్కరించిన కథనాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చదివింది జపనీస్ యాంకర్ యుమికో మాట్సువో. ఆమె లైవ్ లోనే పుతిన్ పై మండిపడ్డారు.
ఇది ఎంత మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. తట్టుకోలేక యాంకర్ కంటతడి పెట్టారు. ప్రస్తుతం జపనీస్ యాంకర్ (Japanese Anchor)వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యారు.
ఆమె బహిరంగంగానే పుతిన్ పై నిప్పులు చెరిగారు. యుద్ద కాంక్ష ప్రపంచానికి మంచిది కాదని సూచించారు యాంకర్.
Also Read : భారత్ తో బంధానికే పాక్ ప్రయారిటీ