JD Lakshmi Narayana : పార్టీ స్థాపిస్తా పోటీలో ఉంటా
జేడీ లక్ష్మీ నారాయణ
JD Lakshmi Narayana : విశాఖపట్టణం – సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అవసరం అనుకుంటే కొత్తగా పార్టీ ఏర్పాటు చేసే అవకాశం లేక పోలేదని పేర్కొన్నారు . బుధవారం జేడీ లక్ష్మినారాయణ మీడియాతో మాట్లాడారు.
JD Lakshmi Narayana Comment
రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు జేడీ లక్ష్మీనారాయణ.
ఏపీలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. డూప్లికేట్ ఓట్లు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నిజమైన ఓట్ల తొలగింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.
జేడీ ఫౌండేషన్ , నిపుణ హ్యూమన్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 2న విశాఖ వేదికగా మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు జేడీ లక్ష్మి నారాయణ(JD Lakshmi Narayana). ఈ జాబ్ ఫేర్ కు 50కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. అక్కడే ఆఫర్ లెటర్లు ఇస్తామని చెప్పారు.
Also Read : CEO Vikas Raj : రాష్ట్రమంతటా 144 సెక్షన్