JDU Mla Bima Bharti : సీఎం నితీష్ పై ఎమ్మెల్యే అసంతృప్తి

కేబినెట్ లో చోటు ద‌క్క‌క పోవ‌డంపై ఫైర్

JDU Mla Bima Bharti : బీహార్ లో కొత్త‌గా సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, పార్టీల‌తో క‌లిపి మ‌హా కూట‌మి స‌ర్కార్ ఏర్ప‌డింది. సీఎంగా నితీష్ ఉండ‌గా డిప్యూటీ సీఎంగా తేజ‌స్వి యాద‌వ్ కొలువు తీరారు.

ఇక్క‌డికి వ‌ర‌కు బాగానే ఉంది. 17 ఏళ్ల రాజ‌కీయ మిత్ర‌త్వాన్ని కాద‌నుకున్నారు నితీశ్ కుమార్. ఆ వెంట‌నే బీజేపీకి చెక్ పెట్టి కొత్త ఒప్పందం చేసుకున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉంది. మొత్తం 31 మందితో కేబినెట్ ను ఏర్పాటు చేశారు. కీల‌క శాఖ‌ల‌న్నీ త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. ఎక్కువ బెర్త్ లు లాలూ ప్ర‌సాద్ పార్టీకి ద‌క్కాయి.

జేడీయూ, కాంగ్రెస్, మాంజీ పార్టీతో పాటు ఓ ఇండిపెండెంట్ కు కూడా కేబినెట్ లో చోటు ద‌క్కింది. అయితే చివ‌రి వ‌ర‌కు మ‌హిళ‌, బ‌హుజ‌న కోటా కింద మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని భావించారు జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బీమా భార‌తి(JDU Mla Bima Bharti).

ఇదే స‌మ‌యంలో లేషి సింగ్ కు చోటు ల‌భించింది. ఆమెకు ఆహార‌, వినియోగ‌దారుల శాఖ‌ను అప్ప‌గించారు సీఎం. లేషి సింగ్ మూడోసారి కేబినెట్ లో కొలువు తీరారు.

అయితే త‌న‌కు చోటు ద‌క్క‌క పోవ‌డంపై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఆమెలో ఏం చూసి ప‌ద‌వి ఇచ్చారో త‌న‌కు తెలియ‌డం లేద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

కాగా తాము వెనుక‌బ‌డిన కులాల‌కు చెందిన వార‌మ‌నే త‌మ‌కు చోటు క‌ల్పించ‌లేదంటూ మండిప‌డ్డారు బీమా భారతితి. ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌కుంటే రాజీనామా చేస్తాన‌ని హెచ్చ‌రించారు.

తాను చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్పైతే త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని హెచ్చ‌రించారు.

Also Read : షాన‌వాజ్ హుస్సేన్ పై రేప్ కేసుకు ఓకే

Leave A Reply

Your Email Id will not be published!