JDU MLAs Shock : జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్
నితీశ్ కుమార్ కు కోలుకోలేని బిగ్ షాక్
JDU MLAs Shock : బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కు కోలుకోలేని షాక్ తగిలింది. మణిపూర్ లో జేడీయూ పార్టీకి చెందిన 7 మంది ఎమ్మెల్యేలలో 5 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై(JDU MLAs Shock) చెప్పారు.
17 ఏళ్ల సుదీర్ఘ అనుబంధానికి చెక్ పెట్టి ఆర్జేడీ, కాంగ్రెస్ , ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్ బీహార్ లో.
ఇది ఊహించని షాక్. పొత్తు ముగించుకున్న కొన్ని వారాల తర్వాత ఇలాంటిది జరుగుతుందని అనుకోలేదు నితీశ్ కుమార్. మణిపూర్ లో జేడీయూకు భవిష్యత్ లేదని, అందుకే తాము కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నట్లు జంప్ అయిన జిలానీలు (ఎమ్మెల్యేలు) పేర్కొన్నారు.
ఆ ఐదుగురు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండగా కాషాయ పార్టీలో చేరడాన్ని మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ఓకే చెప్పడం విశేషం.
దీంతో వారి శాసనసభ సభ్యత్వానికి భద్రత లభించింది. ఒక వేళ జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్(Nitish Kumar) కోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ముందస్తుగా ప్రీ ప్లాన్ గా వ్యవహరించింది భారతీయ జనతా పార్టీ. ఈ మేరకు ఇందుకు సంబంధించి మణిపూర్ అసెంబ్లీ కార్యదర్శి కె. మేఘజిత్ సింగ్ కీలక ప్రకటన చేశారు.
అధికారికంగా ధ్రువీకరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా ఉన్నందు వల్ల వీరి చేరిక చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించ బడుతుంది. ఇ
దిలా ఉండగా 2020లో అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు గాను ఆరు గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఆ తర్వాత రెండేళ్ల అనంతరం ఇప్పుడు మణిపూర్ లో 5 మంది జంప్ కావడం చర్చకు దారి తీసింది.
Also Read : నిరుద్యోగం ఎన్నాళ్లీ మోసం – వరుణ్ గాంధీ