Jennifer Larson : తిరుమలలో యుఎస్ కాన్సుల్ జనరల్
అద్బుతమైన ఆనందం పొందానన్న లార్సన్
Jennifer Larson : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల పుణ్య క్షేత్రాన్ని శుక్రవారం హైదరాబాద్ లోని యుఎస్ (అమెరికా) కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె ప్రత్యేకంగా ఫోటోను షేర్ చేశారు ట్విట్టర్ వేదికగా. అలౌకికమైన ఆనందానికి లోనయ్యానని, దివ్యమైన అనుభూతి తాను పొందానని పేర్కొన్నారు.
Jennifer Larson Express
వేలాది మంది భక్తులను తాను దగ్గరుండి చూశానని, లార్డ్ వేంకటేశ్వరుడిని చూసి తరించి పోయానని తెలిపారు జెన్నిఫర్ లార్సన్(Jennifer Larson). ఇక్కడి పవిత్రత తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఇక్కడి అలౌకికమైన భక్తి భావాన్ని , భక్తులను చూసి, వారి నామ స్మరణను చూసి విస్మయానికి గురైనట్లు తెలిపారు యుఎస్ కాన్సుల్ జనరల్.
విధి నిర్వహణలో తాను ఇక్కడికి రావడం సంతోషం కలిగించిదని పేర్కొన్నారు. తన జీవిత కాలంలో ఇలాంటి పుణ్య క్షేత్రాన్ని చూడ లేదంటూ తెలిపారు జెన్నిఫర్ లారెన్స్.
ఇదిలా ఉండగా తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని, శ్రీ అలివేలు మంగమ్మను దర్శించకుంటున్న వారిలో ఎక్కువ శాతం విదేశీయులు కూడా ఉండడం విశేషం. ఈ మధ్యనే మరికొందరు ఉన్నత స్థానాలలో ఉన్న వారు శ్రీవారిని దర్శించు కోవడం గమనార్హం.
Also Read : BRS MPs Proetst : మోదీ మణిపూర్ పై మౌనమేల – బీఆర్ఎస్