Jeremy Farrar : డబ్ల్యుహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ గా జెరెమీ ఫర్రార్
నియమించిన ఐక్య రాజ్య సమితి
Jeremy Farrar : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ గా జెరెమీ ఫర్రార్(Jeremy Farrar) నియమితులయ్యారు. ఇప్పటి వరకు భారత దేశానికి చెందిన ప్రముఖ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ సేవలు అందించారు. ఇటీవలే ఆమె అత్యున్నతమైన పదవి నుంచి తప్పుకున్నారు. ఐక్య రాజ్య సమితి ఉండాలని కోరినా ఆమె ఒప్పుకోలేదు.
తాను ఇప్పటి వరకు చేసిన సేవలు చాలని, కానీ దేశం కోసం, నా ప్రాంతానికి, ప్రజలకు సేవలు చేయాలని ఉందని అందుకే తాను విధులు చేపట్టలేనని స్పష్టం చేశారు సౌమ్యా స్వామినాథన్. ఈ సమయంలో కీలకమైన పోస్ట్ కోసం జెరెమీ ఫర్రార్ కొలువు తీరారు. ప్రధాన శాస్త్రవేత్తగా ఎంపిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా కష్ట కాలంలో, ఇతర రోగాలు ప్రపంచాన్ని భయ పెడుతున్న తరుణంలో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏజెన్సీ సిద్దం అవుతున్నందున జెరెమీ ఫర్రార్ తన కొత్త ప్రధాన శాస్త్రవేత్త అవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ నెలలో నిష్క్రమించిన సౌమ్య స్వామినాథన్ స్థానంలో జెరెమీ ఫర్రార్(Jeremy Farrar) 2023 మార్చి నెలలో చేరనున్నారని సమాచారం.
ఐక్య రాజ్య సమితి ఏజెన్సీ నాకుడిగా డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ రెండవ సారి బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంగా ప్రధాన శాస్త్రవేత్తగా జెరెమీ నియమించినందుకు సంతోషంగా ఉంది. ఆయన త్వరలో భాగస్వామ్యం పంచుకోనున్నారు. ప్రాణాలను రక్షించే కీలకమైన బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు.
Also Read : ద్వేషిస్తే దేశం మిగలదు – రాహుల్ గాంధీ