Jharkhand CM : యూపీఏ సమావేశానికి హేమంత్ సోరేన్ పిలుపు
అనర్హత వేటుపై హేమంత్ సోరేన్ నిర్ణయం
Jharkhand CM : అనర్హత వేటు సందడి మధ్య జార్ఖండ్ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం యుపీఏ సమావేశానికి పిలుపు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికల రూల్స్ ఉల్లంఘించినందుకు హేమంత్ సోరేన్ ను ఎమ్మెల్యేగా అనర్హత చేయాలని ఎన్నికల సంఘం గవర్నర్ కు తెలియ చేసినట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.
సీఎం సోరేన్ ను ఎమ్మెల్యేగా అనర్హులుగా ప్రకటిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జేఎంఎం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆయనను కచ్చితంగా తప్పిస్తారని ప్రచారం జోరందుకుంది.
మరో వైపు మధ్యంతర ఎన్నికలకు బీజేపీ పిలుపు ఇవ్వడం, సోరేన్ భవిష్యత్తు వ్యూహం కోసం పార్టీ సభ్యులు, మిత్రపక్షాలను కూడగట్టు కోవడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి.
తుది నిర్ణయం ఇప్పటికీ గవర్నర్ రమేష్ బాయిస్ తో మూసి ఉన్న ఎన్వలప్ లో ఉంది. రాష్ట్రంలోని అధికార కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని తేల్చి చెప్పింది.
హేమంత్ సోరేన్ రాంచీ లోని తన నివాసంలో యూపీఏ ప్రత్యేక భేటీకి పిలుపునిచ్చారు. మరో వైపు కేంద్రంలోని మోదీ, బీజేపీ ప్రభుత్వం బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకుందని జేఎంఎం ఆరోపించింది.
యూపీఏ కూటమిలో భాగంగా అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా 2024 వరకు సోరేన్ సీఎంగా కొనసాగుతారని విశ్వసిస్తోంది. ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేస్తారని వస్తున్న ప్రచారం తనకు ఇంకా రాలేదన్నారు సీఎం హేమంత్ సోరేన్(Jharkhand CM).
అయితే తనంతకు తాను గా స్వంతంగా మైన్స్ లీజుకు తీసుకున్నారంటూ భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది గవర్నర్ కు.
Also Read : రూ. 800 కోట్లతో సర్కార్ కూల్చేందుకు కుట్ర