Jharkhand CM : జార్ఖండ్ సీఎంకు గవర్నర్ బిగ్ షాక్
హేమత్ సోరేన్ శాసనసభ సభ్యత్వం రద్దు
Jharkhand CM : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. గనుల కేటాయింపు వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు రాష్ట్ర గవర్నర్ సోరేన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
సీఎం పదవిలో ఉన్న వ్యక్తి తనంతకు తానుగా మైన్స్ కేటాయింపులు చేసుకున్నారంటూ భారతీయ జనతా పార్టీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు ఈ విషయంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరేన్(Jharkhand CM) శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చా లేదా అన్న దానిపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ కోరుతూ లేఖ రాశారు.
దీంతో సీఈసీ రద్దు చేయొచ్చని స్పష్టం చేసింది. సీఈసీ సిఫారసుతో గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకున్నారు. సీఎం హేమంత్ సోరేన్ కు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చారు.
దీంతో సీఎం తన ఎమ్మెల్యే హోదాను కోల్పోయారు. అయితే సీఎంగా ఆరు నెలల పాటు ఉంటారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఆ తర్వాత తను మరోసారి గెలవాల్సి ఉంటుంది.
తన నిర్దోషిత్వాన్ని నిరూపించు కోవాల్సి ఉంటుంది. శాసనసభ సభ్యత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ జేఎంఎం కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆ పార్టీకి చెందిన ఎంపీ స్పష్టం చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కావాలని బీజేపీయేతర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ వస్తోందని ఆరోపించారు సీఎం హేమంత్ సోరేన్. ఆయన నిర్దోషిగా ఎన్నికైతేనే తిరిగి సీఎంగా కొలువుతీరుతారు.
ప్రస్తుతం విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి జార్ఖండ్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని.
Also Read : ఆజాద్ సరే అసమ్మతి నేతల దారెటు