Jharkhand CM Win : విశ్వాస పరీక్షలో సోరేన్ విజయం
భారతీయ జనతా పార్టీ కుట్ర ఫెయిల్
Jharkhand CM Win : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతూ వచ్చిన జార్ఖండ్ ప్రభుత్వ సంక్షోభం ఎట్టకేలకు ముగింపు పలికింది. సోమవారం శాసనసభ సాక్షిగా విశ్వాస పరీక్షలో అద్భుత విజయాన్ని నమోదు చేశారు జేఎంఎం చీఫ్, సీఎం హేమంత్ సోరేన్(Jharkhand CM Win) .
మెజారిటీ నిరూపించు కునేందుకు ముందే ప్రకటించారు సీఎం. ఈ విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొంది. చివరికి సోరేన్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు అసెంబ్లీ సాక్షిగా. దీంతో ప్రతిపక్షానికి చెందిన భారతీయ జనతా పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం హేమంత్ సోరేన్. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడంలోనే ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు.
ప్రధానంగా దేశంలో ప్రజలు రేషన్ కోసం దుస్తులు, వస్తువులను కొనుగోలు చేసినట్లు బీజేపీ , మోదీ త్రయం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
మోదీ ఇలాఖాలో ఆయన ఎనిమిదేళ్ల ఏలుబడిలో ఎనిమిది రాష్ట్రాలను అప్రజాస్వామికంగా కూల్చి వేశారంటూ మండిపడ్డారు.
ఆపై ఇటీవల షిండే ను అడ్డం పెట్టుకుని మరాఠాలో మహా వికాస్ అఘాడీని కూల్చారని అదే సమయంలో జార్ఖండ్ లో కొత్త నాటకానికి తెర తీశారంటూ ధ్వజమెత్తారు.
అంతే కాదు ఎన్నికల్లో గెలిచేందుకు అల్లర్లకు ఆజ్యం పోస్తూ రాజకీయంగా బలపడాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా తాను మగాడినని నిరూపించుకున్నారు హేమంత్ సోరేన్(CM Hemanth Soren).
తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయంలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రధాన పాత్ర వహించారంటూ ఆరోపించారు సోరేన్.
Also Read : ఉద్దవ్ ఠాక్రేకు గుణపాఠం చెప్పాలి – షా