Jharkhand Crisis : జార్ఖండ్ లో తేలనున్న భవితవ్యం
అవిశ్వాస పరీక్షకు సీఎం సోరేన్ రెడీ
Jharkhand Crisis : జార్ఖండ్ లో జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం సోమవారం అగ్నిపరీక్షను(Jharkhand Crisis) ఎదుర్కొంటోంది. ఇప్పటికే సీఎంగా ఉన్న హేమంత్ సోరేన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు గవర్నర్.
తనంతకు తానుగా మైన్స్ ను కేటాయించు కోవడాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చర్య తీసుకోవాలా లేదా అన్న దానిపై క్లారిటీ కోరుతూ గవర్నర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
పరిశీలించిన సీఈసీ ఆధారాలు రుజువైతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయొచ్చని, ఆ అధికారం గవర్నర్ కు ఉందంటూ స్పష్టం చేసింది.
ఆ విషయంపై స్పష్టత రావడంతో వెంటనే ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో హేమంత్ సోరేన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆరు నెలల పాటు సీఎంగా కొనసాగించే అవకాశం ఉంది. కానీ అంత లోపు తన నిర్దోషిత్వాన్ని నిరూపించు కోవాల్సి ఉంటుంది.
అంత లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పావులు కదిపింది. ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిందంటూ సాక్షాత్తు సీఎం హేమంత్ సోరేన్(CM Hemanth Soren) ఆరోపించారు.
ముందస్తు కాషాయ వ్యూహాన్ని గుర్తించిన సోరేన్ జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ముందుగా గెస్ట్ హౌస్ లకు తరలించారు.
అనంతరం అక్కడి నుంచి నేరుగా ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ కు తరలించారు. అంతకు ముందు సోరేన్ గవర్నర్ కు ఫోన్ చేశారు. తాము బల నిరూపణకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
Also Read : పిల్లల ఆహారాన్ని బుక్కేశారు