Jignesh Mevani : మోదీ ఇలాఖాలో స‌త్తా చాటిన‌ ‘మేవానీ’

గుజ‌రాత్ రాష్ట్రంలో వ‌డ్గామ్ లో తిరిగి గెలుపు

Jignesh Mevani : జిగ్నేష్ మేవానీ మోస్ట్ పాపుల‌ర్ నాయ‌కుడు. ప్ర‌ధానంగా దేశంలోని రైట్ వింగ్ ను ఏకి పారేస్తున్న నాయ‌కుడు. అంతే కాదు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ నిత్యం హాట్ టాపిక్ గా మారారు. ఆపై ఆయ‌న ఎమ్మెల్యేగా ఉండ‌గానే అరెస్ట్ అయ్యారు. కానీ గుజ‌రాత్ రాష్ట్రంలో తాజాగా జ‌రిగిన ఎన్నికల్లో ఎంతో మంది ఓట‌మి పాల‌య్యారు.

కానీ జిగ్నేష్ మేవానీ(Jignesh Mevani)  మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్ర‌శ్నించే గొంతుక‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌డం విస్తు పోయేలా చేసింది. ఓవైపు భారీ ఎత్తున సీట్ల‌ను గెలుపొందింది బీజేపీ. రాష్ట్ర చ‌రిత్ర‌లో క‌నీవిని ఎరుగ‌ని రీతిలో రికార్డు స్థాయిలో సీట్ల‌ను గెలుచుకుంది. అంతే కాదు మోదీ పేరు మీద ఉన్న రికార్డును ప్ర‌స్తుత సీఎం భూపేష్ ప‌టేల్ చెరిపేశారు.

కానీ ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా అన్నీ తానై ప్రచారం చేసినా , మోదీ 30 సార్ల‌కు పైగా ర్యాలీలు చేప‌ట్టినా వ‌డ్గామ్ లో ప్ర‌భావం చూప‌లేక పోయారు. జిగ్నేష్ మేవానీ విజ‌యాన్ని అడ్డుకోలేక పోయారు. ఆయ‌న‌కు ఇప్పుడు 41 ఏళ్లు . రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్ర‌ముఖుడిగా ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా జిగ్నేష్(Jignesh Mevani)  గుజ‌రాత్ కాంగ్రెస్ పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ . ఆయ‌న త‌న సీటును మ‌ళ్లీ గెలుచుకున్నా పార్టీని ర‌క్షించ లేక పోయారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ ఆయ‌న గెలుపు ప‌త్రాన్ని అందుకున్నారు. త‌న‌కు ఓటు వేసిన వారికి, వేయ‌ని వారంద‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని అన్నారు జిగ్నేష్ మేవానీ. ఈ విజ‌యం ప్ర‌జ‌ల‌కు అంకితం ఇస్తున్నాన‌ని చెప్పారు.

Also Read : సీఎం ఎంపిక నిర‌స‌న సెగ‌

Leave A Reply

Your Email Id will not be published!