Jignesh Mevani : ప్రధానమంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారంటూ అస్సాం పోలీసులు గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని(Jignesh Mevani) అరెస్ట్ చేశారు. దీనిపై గౌహతి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉండగానే మేవానీ పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశారంటూ మరో కేసు నమోదైంది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిని సవాల్ చేస్తూ జిగ్నేష్ మేవానీ తరపు న్యాయవాది బెయిల్ మంజూరు కోసం పిటిషన్ దాఖలు చేశారు.
ఏప్రిల్ 25న దాడి కేసులో మరోసారి అరెస్ట్ కావడం సంచలనం కలిగించింది. భారతీయ జనతా పార్టీ కావాలనే ఇలా చేస్తోందంటూ జిగ్నేష్ మేవానీ(Jignesh Mevani) ఆరోపించారు. అస్సాం కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.
ఎమ్మెల్యే తనపై దాడికి పాల్పడ్డాడని, చెప్పుకోలేని రీతిలో దూషించాడంటూ మహిళా కానిస్టేబుల్ ఆరోపించింది. దీంతో మళ్లీ జిగ్నేష్ మేవానీని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
అస్సాం లోని కోక్రాజార్ కు చెందిన స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీపై ఆరోపణలు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఇంట్లో ఉన్న ఎమ్మెల్యేను ముందస్తు సమాచారం లేకుండానే అస్సాం పోలీసులు అహ్మదాబాద్ కు తరలించారు. అక్కడి నుంచి గౌహతికి తీసుకు వచ్చారు.
గుజరాత్ లోని పాలన్ పూర్ లో ఉంటున్నారు ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ. తనపై నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయం కక్ష కట్టిందని, కేసులు నమోదు చేయిస్తోందంటూ ధ్వజమెత్తారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. కానీ పార్టీలో చేరలేదు.
Also Read : అఖిలేష్ యాదవ్ పై మాయావతి ఫైర్