Jitender Reddy Eatala : ఈటల‌పై జితేంద‌ర్ రెడ్డి కామెంట్స్

స‌ర్పంచ్ లు..ఎంపీటీసీల‌ను కొన్నారు

Jitender Reddy Eatala : భార‌తీయ జ‌న‌తా పార్టీలో విభేదాలు మ‌ళ్లీ భ‌గ్గుమ‌న్నాయి. నిన్న‌టి దాకా కామ్ గా ఉన్న ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఆముదాల‌పాడు జితేంద‌ర్ రెడ్డి మ‌రోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న బీజేపీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్ ఈట‌ల రాజేంద‌ర్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఎన్నిక‌ల‌కు ముందు ఈట‌ల స‌ర్పంచ్ లు, ఎంపీటీసీల‌ను కొనుగోలు చేశాడంటూ ఆరోపించారు. టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వ‌చ్చిన వెంట‌నే ఉప ఎన్నిక‌ల‌కు ముందే స‌ర్పంచ్ లు, ఎంపీటీసీల‌ను కొనుగోలు చేసి ఢిల్లీకి తీసుకుని వెళ్లాడంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశాడు.

స్వంత పార్టీ అగ్ర నేత ఈట‌ల రాజేంద‌ర్ పై జితేంద‌ర్ రెడ్డి(Jitender Reddy) ప‌దే ప‌దే వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. ముందు నుంచీ జితేంద‌ర్ రెడ్డి క‌రీంన‌గ‌ర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఇటీవ‌లే త‌ప్పుకున్న బండి సంజ‌య్ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఇదే స‌మ‌యంలో జితేంద‌ర్ రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. దున్న‌పోతును తన్నుతున్న దృశ్యం ఇందులో ప్ర‌ధానంగా ఉంది. ఇది కేవ‌లం ఈట‌ల రాజేంద‌ర్ ను ఉద్దేశించి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. చివ‌ర‌కు హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ రంగంలోకి దిగారు. జితేంద‌ర్ రెడ్డి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్ ను క‌లిపారు. స‌యోధ్య కుదిర్చారు. ఓరుగ‌ల్లు స‌భ‌లో ఇద్ద‌రూ క‌లిసే ఒకే వేదిక‌ను పంచుకున్నారు.

Also Read : US Drone Strike Kills : ఇస్లామిక్ లీడ‌ర్ ఉసామా ఖ‌తం

 

Leave A Reply

Your Email Id will not be published!