Jithender Reddy : రేవంత్ ఫోన్ జితేంద‌ర్ రెడ్డి ఖుష్

ట్వీట్ అద్భుతం అంటూ ప్ర‌శంస‌

Jithender Reddy : మాజీ ఎంపీ, బీజేపీ సీనియ‌ర్ నేత ఆముదాల‌పాడు జితేంద‌ర్ రెడ్డి(Jithender Reddy) జోష్ పెంచారు. ఆయ‌న సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆయ‌న చేసిన దున్నుపోతుతో కూడిన వీడియో షేర్ చేయ‌డం, దానికి అంద‌మైన క్యాప్ష‌న్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. చివ‌ర‌కు ఆ ట్వీట్ ను డిలీట్ చేసినా కావాల్సినంత ప్ర‌చారం వ‌చ్చింది. ఇది మాజీ ఎంపీ కూడా ఊహించ‌ని రీతిలో ప్ర‌చారం ల‌భించింది.

రోజుకో బాంబు పేల్చుతూ హాట్ టాపిక్ గా మారేలా చేస్తున్నాడు. తాజాగా మ‌రో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు జితేంద‌ర్ రెడ్డి. అదేమిటంటే తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిట చీఫ్ , మ‌ల్కాజ్ గిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి త‌న‌కు ఫోన్ చేశాడ‌ని వెల్ల‌డించారు. తాను చేసిన ట్వీట్ సూప‌ర్ గా ఉందంటూ కితాబు ఇచ్చాడ‌ని తెలిపాడు. ఆపై త‌న‌ది క‌వి హృద‌యం అంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడ‌ని సంతోషం వ్య‌క్తం చేశారు మాజీ ఎంపీ.

ఇదే స‌మ‌యంలో బీజేపీ స్టేట్ చీఫ్ ప‌ద‌వి గురించి చేసిన ట్వీట్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి , హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్. ఉన్న‌ట్టుండి త‌న‌తో లంచ్ కు రావాలంటూ జితేంద‌ర్ రెడ్డి పిల‌వ‌డం ఆయ‌న‌తో ఈట‌ల క‌ల‌వ‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : Rishi Sunak Dravid : ద్ర‌విడ్ వ్య‌క్తిత్వం ఇష్టం – పీఎం

 

Leave A Reply

Your Email Id will not be published!