Jitta Balakrishna Reddy : బీజేపీ నేత జిట్టా భూ కబ్జా
ఆక్రమణలు తొలగింపు
Jitta Balakrishna Reddy : ఆయన భారతీయ జనతా పార్టీలో కీలకమైన నాయకుడు. నిత్యం ప్రజల సమస్యల గురించి మాట్లాడతారు. ఆపై తెలంగాణ ఉద్యమంలో తాను ముఖ్య పాత్ర పోషించానంటూ చెబుతుంటాడు. ఆపై అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పై, సీఎం కేసీఆర్ పై, కల్వకుంట్ల ఫ్యామిలీని ఏకి పారేస్తుంటాడు. ఆయనెవరో కాదు జిట్టా బాల కృష్ణా రెడ్డి(Jitta Balakrishna Reddy). నిత్యం నీతులు వల్లించే సదరు నేత ఆక్రమణలకు పాల్పడడం విస్తు పోయేలా చేసింది.
Jitta Balakrishna Reddy Issue
హైదరాబాద్ లోని బండ్లగూడ సమీపంలో ఉన్న తట్టి అన్నారంలో జిట్టా బాలకృష్ణా రెడ్డికి చెందిన జే కన్వెన్షన్ సెంటర్ ఉంది. దానికి పార్కింగ్ సౌకర్యం లేక పోవడం తో జే కన్వెన్షన్ యాజమాన్యం పక్కనే ఉన్న 10 ఎకరాల కుంట ఉంది. మనోడి కన్ను దానిపై పడింది. ఇంకేం సదరు కుంటను సైతం కబ్జాకు పాల్పడ్డడాడు. దానిని పూడ్చేసి పార్కింగ్ ఏర్పాటు చేశాడు. ఆపై దానిని యధేశ్చగా వాడుకుంటున్నాడు.
వ్యవసాయానికి ఉపయోగపడే కుంటను కబ్జా చేయడాన్ని గుర్తించారు తట్టి అన్నారం రైతులు. ఈ విషయాన్ని గత మే నెల 24న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా రంగంలోకి దిగారు అధికారులు. ఆక్రమణలు జరిగింది వాస్తవమేనని తేల్చారు. ఆపై పూడ్చిన కుంటను తొలగించే పనిలో పడ్డారు. మొత్తంగా బీజేపీ నేత నిర్వాకంపై రైతులు మండి పడుతున్నారు.
Also Read : Anushka Shetty : 18 ఏళ్లు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టి