JMI Gandhi Books List : జామియా ఇస్లామియాలో గాంధీ పుస్తకాలు
పుస్తకాల జాబితాను విడుదల చేసిన జేఎంఐ
JMI Gandhi Books List : మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ 153వ జయంతి సందర్భంగా జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) కీలక ప్రకటన చేసింది. మహాత్ముడిపై 1500 కంటే ఎక్కువ పుస్తకాల జాబితాను ఏర్పాటు చేసింది. గాంధీ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించింది.
భారత దేశ స్వాతంత్రంలో గాంధీ పాత్రను సూచించేందుకు విశ్వ విద్యాలయం ఈ దినోత్సవాన్ని చేపట్టింది. యూనివర్శిటీలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ లైబ్రరీలో పుస్తక ప్రదర్శనను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మహ్మద్ షకీల్ ప్రారంభించారు.
ఎగ్జిబిషన్ లో మహాత్మా గాంధీకి సంబంధించిన కొన్ని వ్యక్తిగత లేఖలు, పేపర్లు, ఇతర ఆర్కైవల్ మెటీరియల్ లను కూడా గ్రంధాలయంలో ప్రదర్శనకు ఉంచింది యూనివర్శిటీ.
ఈ కార్యక్రమంలో డాక్టర్ జాకీర్ హుస్సేన్ లైబర్రీ తయారు చేసిన మహాత్మా గాంధీపై 1500 కంటే ఎక్కువ పుస్తకాల జాబితాతో కూడిన గ్రంథ పట్టికను కూడా జీఎంఐ విడుదల చేసింది. ఈ ప్రధాన కార్యక్రమానికి ప్రొఫెసర్ షకీల్ అధ్యక్షత వహించారు.
ఇందులో ప్రొఫెసర్ ఫర్హత్ నస్రీన్ మహాత్మా గాంధీపై ఉపన్యాసం, హిందీ విభాగం విద్యార్థిని కవితా మార్గం, ఫ్యాక్టలితో బృంద గీతం, విద్యార్థి ప్రసంగాలు ఉన్నాయి. డిపార్ట్ మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ , ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
ఈ విషయాన్ని జామియా ఇస్లామియా యూనివర్శిటీ(JMI Gandhi Books List) అధికారికంగా ప్రకటించింది. ఆదివారం తెలిపింది ప్రకటనలో. తమ జీవితాలను ఇతరుల మేలు కోసం అంకితం చేసిన మహనీయుల్లో గాంధీ , శాస్త్రి ఒకరని పేర్కొన్నారు ప్రొఫెసర్ ఫర్హత్ నస్రీన్. ఆయన నుంచి తామంతా ప్రేరణ పొందామన్నారు. గాంధేయ మార్గం నేటికి అనుసరణీయమన్నారు.
Also Read : ఆరోగ్యంపై పర్యావరణ ప్రభావం – సౌమ్య