JNU Fine : జేఎన్యూలో రూల్స్ కఠినం
ధర్నా చేస్తే ఫైన్..అడ్మిషన్ రద్దు
JNU Fine : దేశంలోనే పేరొందిన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎవరైనా చదవాలంటే కఠినమైన రూల్స్(JNU Fine) పాటించాల్సిందే. ఈ మేరకు వీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి సదరు సంస్థలో ఎవరైనా సరే ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది వీసీ. ఈ మేరకు కీలకమైన నిబంధనలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది విశ్వ విద్యాలయం. ఇటీవల విద్యా సంస్థలో అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
చివరకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం సీరియస్ గా స్పందించారు. తమ ప్రాంతానికి చెందిన విద్యార్థులపై దాడికి పాల్పడటాన్ని ఖండించారు. విద్యార్థులపై ఏబీవీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. పెరియార్ , అంబేద్కర్, కార్ల్ మార్క్స్ ఫోటోలను తొలగించడం ఘర్షణకు దారి తీసింది. ఇక నుంచి విశ్వ విద్యాలయం క్యాంపస్ లో ధర్నాలు, ఆందోళనలు చేస్తే గనుక రూ. 20,000 ఫైన్ విధించనున్నట్లు స్పష్టం చేసింది.
కేవలం కేటాయించిన గదులలోనే విద్యార్థులు ఉండాలని , నిధులను దుర్వినియోగం చేసినా లేదా యూనివర్శిటీ కార్యకలాపాలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు వైస్ ఛాన్సలర్ . ఎవరైనా అవమానకరమైన రీతిలో మాట్లాడినా సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు.
ఇందులో భాగంగా జవహర్ లాల్ నెహ్రూ(JNU Fine) యూనివర్శిటీ వీసీ శాంతిశ్రీ పండిట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక నుంచి ఎలాంటి కార్యక్రమాలను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు 10 పేజీలతో కూడిన సర్క్యులర్ ను జారీ చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యా సంస్థలు స్వేచ్ఛకు ద్వారాలు తెరవాలే తప్పా రూల్స్ పేరుతో కట్టడి చేస్తే ఎలా అని ప్రశ్నించాయి.
Also Read : ఈసీపై సుప్రీం తీర్పు సూపర్