Joe Biden : అమెరికా చీఫ్ జో బైడెన్ భావోద్వేగం

దేశం కోల్పోయిన దిగ్గ‌జ‌మ‌ని కామెంట్

Joe Biden : అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌న చిర‌కాల మిత్రుడంటూ జ‌పాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి షింజో అబేను గుర్తుకు తెచ్చుకున్నారు.

షింజో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న సంద‌ర్భంలో ఓ దుండ‌గుడి చేతిలో కాల్పుల‌కు గుర‌య్యాడు. ఆపై తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో ఆయ‌న‌ను ఆస్ప‌త్రిలో చేర్చారు. అక్క‌డ చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆయ‌న మృతితో జ‌పాన్ దేశమే కాదు యావ‌త్ ప్ర‌పంచం గొప్ప నాయ‌కుడిని కోల్పోయిందంటూ పేర్కొన్నారు జోసెఫ్ బైడెన్(Joe Biden). త‌న‌కు వ‌ర‌కు స్వంత సోద‌రుడిని కోల్పోయినంత బాధ‌గా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

షింజో అబే లేక పోవ‌డం జ‌పాన్ కు తీర‌ని లోటు అని ప్ర‌త్యేకించి అమెరికాకు కూడా అని పేర్కొన్నారు జోసెఫ్ బైడెన్. ఈ మేర‌కు సుదీర్ఘ సంతాప సందేశాన్ని అమెరికా దేశాధ్య‌క్షుడు జ‌పాన్ రాయ‌బారి కోచి టొమితాకు అంద‌జేశారు.

ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది. షింజో అబే చివ‌రి వ‌ర‌కు అమెరికాతో పాటు ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌తో స‌త్ సంబంధాలు నెరిపార‌ని, ఆ దేశాన్ని అత్యంత శ‌క్తివంత‌మైన దేశంగా తీర్చి దిద్ద‌డంలో కీల‌క పాత్ర పోషించాడంటూ ప్ర‌శంసించారు.

హింస ఎన్న‌టికీ ఆమోద యోగ్యం కాద‌ని, శాంతి ఒక్క‌టే ఈ ప్ర‌పంచానికి మార్గ‌మ‌ని దానిని గుర్తించి కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు.

షింజో అబే అంటే ఒక వ్య‌క్తి కాద‌ని శ‌క్తి అని..అంతే కాకుండా శాంతికి, ఓర్పుకు మారు పేరు అంటూ పేర్కొన్నారు జో బైడెన్.

Also Read : పారిపోయిన శ్రీ‌లంక ప్రెసిడెంట్

Leave A Reply

Your Email Id will not be published!