Joe Biden : అమెరికన్లకు జో బైడెన్ ఖుష్ కబర్
సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లుకు ఓకే
Joe Biden : అమెరికన్లకు తీపి కబురు చెప్పారు ఆ దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్. గత కొంత కాలంగా సేమ్ సెక్స్ పై చర్చలు జరుగుతున్నాయి. ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. చివరకు సేమ్ సెక్స్ మ్యారేజ్ కు సంబంధించిన కీలక బిల్లుపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుపై ప్రెసిడెంట్ సంతకం చేశారు.
దీంతో ఇక నుంచి స్వలింగ సంపర్కులు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలు కలుగుతుంది. అంతే కాదు వారు కూడా సమాజంలో భాగం కానున్నారు. అంతే కాకుండా పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బైడెన్. బిల్లు చట్టంగా మారడంతో స్వలింగ సంపర్కులలో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నా జీవితంలో ఆనందకరమైన రోజుగా పేర్కొన్నారు. అమెరికా అత్యున్నతమైన మానవ సమాజం కోరుకునే సమానత్వం దిశగా ప్రయాణం చేస్తందన్నారు జోసెఫ్ బైడెన్(Joe Biden).
స్వేచ్ఛ, న్యాయం, భద్రత, గుర్తింపు, హక్కులు ఇవేవీ కొందరికే కావని అందరికీ చెందినవేనని అర్థం చేసుకోవాలన్నారు. ఇక నుంచి గత కొంత కాలం నుంచి నిరాదరణకు గురైన వారందరూ తల ఎత్తుకుని తిరగ వచ్చని స్పష్టం చేశారు జోసెఫ్ బైడెన్.
చాలా మంది ఈ చట్టం కోసం పోరాటాలు చేశారు. మీ విలువైన సమయం కోల్పోయారు. ఇంకొందరు కొలువులు కూడా కోల్పోయారు. ఎందరో విలువైన బంధాలను కూడా వదులుకున్నారు. ఇది నన్ను బాధకు గురి చేసిందన్నారు. తాను ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇక నుంచి మీరంతా స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించమని పిలుపునిచ్చారు జోసెఫ్ బైడెన్.
Also Read : సరిహద్దులో పరిస్థితి స్థిరంగా ఉంది – చైనా