Joe Biden : పుతిన్ కు అంత సీన్ లేదు – బైడ‌న్

ర‌ష్యా అధ్య‌క్షుడికి స్ట్రాంగ్ వార్నింగ్

Joe Biden : అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై నిప్పులు చెరిగారు. త‌మ‌తో పెట్టుకుంటే ఇక మిగిలేది యుద్ద‌మేన‌ని ప్ర‌క‌టించారు.

ఉక్రెయిన్ పై యావ‌త్ ప్ర‌పంచం వ‌ద్ద‌న్నా ఏక‌ప‌క్షంగా సైనిక చ‌ర్య పేరుతో దాడులు చేయ‌డాన్ని మొద‌టి నుంచి ఖండిస్తున్నా ప‌ట్టించు కోవ‌డం లేద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ లోని నాలుగు ప్ర‌ధాన ప్రాంతాల‌ను తాము విలీనం చేసుకుంటున్న‌ట్లు అధికారికంగా ర‌ష్యా చీఫ్ పుతిన్ ప్ర‌క‌టించారు.

అంతే కాదు వాటిని స్వాధీనం చేసుకునేందుకు వీలైతే అణ్వాయుధాలు కూడా ప్ర‌యోగిస్తామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై తీవ్రంగా స్పందించాడు బైడెన్.

ర‌ష్యాకు తీవ్ర స్థాయిలో జ‌వాబు ఇచ్చారు. పుతిన్ బెదిరింపుల‌కు తాము భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఒక దేశాధ్య‌క్షుడిగా ఉండాల్సిన ల‌క్ష‌ణాలు ఆయ‌న‌కు లేకుండా పోయాయ‌ని మండిప‌డ్డారు అమెరికా ప్రెసిడెంట్(Joe Biden) .

ఇలాగే రెచ్చి పోతే తాము చూస్తూ ఊరుకోబోమ‌న్నారు. అమెరికా, మిత్ర దేశాలు ఎప్ప‌టికీ త‌ల‌వంచవ‌ని ఇది పుతిన్ తెలుసుకుంటే త‌న‌కే మంచిద‌ని సూచించారు.

నాటో కూట‌మి ద‌ళాల‌తో క‌లిసి నాటో భూభాగంలో ప్ర‌తి ఇంచును ర‌క్షించు కునేందుకు తాము సిద్ద‌మై ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు జోసెఫ్ బైడెన్.

తాజాగా అమెరికా చీఫ్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. అణ్వాయుధాల బూచి చూపి భ‌య‌పెట్టాల‌ని అనుకోవ‌డం మూర్ఖ‌త్వ‌మేన‌ని పేర్కొన్నారు.

ప్ర‌తి ఇంచును తాము కాపాడుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇంకొక‌సారి ఇలాంటి ప్ర‌క‌ట‌నలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు జో బైడెన్. అయితే ర‌ష్యా చీఫ్ పుతిన్ బైడ‌న్ కామెంట్స్ ను లైట్ తీసుకున్నారు.

Also Read : పాకిస్తాన్ ప్ర‌భుత్వ‌ ట్విట్ట‌ర్ ఖాతా బ్లాక్

Leave A Reply

Your Email Id will not be published!