Joe Biden : బైడెన్ ఇజ్రాయిల్ టూర్
నేడే రానున్నారని వెల్లడి
Joe Biden : అమెరికా – యుఎస్ దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ బుధవారం హమాస్ దాడుల్లో తీవ్రంగా దెబ్బ తిన్న ఇజ్రాయెల్ ను సందర్శించనున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ కీలకమైన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ కు మద్దతు తెలిపేందుకు బైడెన్(Joe Biden) ఆ దేశంలో పర్యటిస్తారని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు.
Joe Biden Visiting Israel
ఇదిలా ఉండగా గత కొన్ని తరాల నుండి పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమైన పోరు కొనసాగుతోంది. హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయె్ల్ పై మెరుపు దాడులకు పాల్పడ్డారు. ఇంకా ఇరు వర్గాల మధ్య యుద్దం కొనసాగుతోంది.
టెర్రరిస్టు మూకలను ఎట్టి పరిస్థితుల్లో వదలి పెట్టబోమంటూ హెచ్చరించింది ఇజ్రాయెల్. ఎక్కడ ఉన్నా పట్టుకుని తీరుతామంటూ ప్రకటించింది. ఇదిలా ఉండగా హమాస్ గ్రూప్ కమాండర్ ను మట్టుబెట్టింది ఇజ్రాయెల్ కు.
మరో వైపు హమాస్ టెర్రరిస్టులకు మద్దతు ఇస్తోంది ఇరాన్. ఈ మేరకు అమెరికాకు, ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆ దేశ అధ్యక్షుడు. ఇప్పుడు యూదులు, ముస్లింల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వచ్చాయి. ఈ యుద్ద వాతావరణంలో బైడెన్ అక్కడికి చేరుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : Chandra Babu Case : బాబు కేసుపై తీర్పు రిజర్వ్