John Kirby : ర‌ష్యా ప‌ట్ల భార‌త్ స్ప‌ష్టంగా ఉంది

పెంట‌గాన్ ప్రెస్ సెక్ర‌ట‌రీ జాన్ కిర్ఫీ

John Kirby : అమెరికా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది మ‌రోసారి భార‌త్ పై. ర‌ష్యా ప‌ట్ల భార‌త్ వైఖ‌రి స్ప‌ష్టంగానే ఉంద‌ని, ఆ దేశం త‌న పంథాను మార్చుకోదంటూ సెటైర్ వేసింది.

ర‌క్ష‌ణ అవ‌స‌రాల కోసం ర‌ష్యాపై భార‌త్ ఆధార ప‌డ‌డాన్ని గుర్తు చేశారు పెంట‌గాన్ ప్రెస్ సెక్ర‌ట‌రీ జాన్ కిర్ఫీ(John Kirby). భార‌త దేశంతో పాటు ఇత‌ర దేశాలు కూడా సత్ సంబంధాలు ఉండ కూడ‌ద‌ని తెలిపామ‌ని కానీ ప‌ట్టించు కోలేద‌ని పేర్కొన్నారు.

ఇది ఎంత మాత్రం మంచిది కాద‌ని సూచించారు. వాషింగ్ట‌న్ లో జాన్ కిర్ఫీ(John Kirby) మీడియాతో మాట్లాడారు. ఇదు స‌మ‌యంలో తాము భార‌తదేశంతో క‌లిగి ఉన్న ర‌క్ష‌ణ భాగ‌స్వామ్యానికి కూడా విలువ ఇస్తామ‌ని వెల్ల‌డించారు.

దానిని మ‌రింత మెరుగు ప‌ర్చేంఉద‌కు మార్గాల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. ఇది ముఖ్య‌మైన‌ది క‌నుక ఇది కొన‌సాగుతుంద‌న్నారు.

అక్టోబ‌ర్ 2018లో భార‌త‌దేశం త‌న వైమానిక ర‌క్ష‌ణ‌ను పెంచు కోవ‌డాని S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ల‌కు సంబంధించి 5 యూనిట్ల‌ను కొనుగోలు చేసేందుకు ర‌ష్యాతో ఒప్పందం చేసుకుంది భార‌త్.

ఈ మేర‌కు సంత‌కం కూడా చేసింది. ట్రంప్ ప‌రిపాల‌న నుండి కాంట్రాక్టుతో ముందుకు వెళ్లేందుక ఆహ్వానించ‌వ‌చ్చ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ర‌ష్యా నుంచి ఎస్ -400 క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల బ్యాచ్ కొనుగోలు కోసం యుఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ కౌన్సిల‌ర్ డెరెక్ చొలెట్ ఆధ్వ‌ర్యంలో ట‌ర్కీపై అమెరికా ఆంక్ష‌లు విధించింది.

ఇదిలా ఉండ‌గా జోసెఫ్ బైడెన్ అడ్మినిస్ట్రేష‌న్ భార‌త్ తో క‌లిసి ప‌ని చేసేందుకు చాలా ఆస‌క్తిగా ఉంద‌న్నారు.

Also Read : జోస్ బ‌ట్ల‌ర్ ప‌డిక్క‌ల్ స‌య్యాట

Leave A Reply

Your Email Id will not be published!