Nitin Gadkari : కాంగ్రెస్ లో చేరమంటే బావిలో దూకుతానన్నా
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్స్
Nitin Gadkari : రోజు రోజుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) షాకింగ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. మొన్న దేశంలో ఎన్నో వనరులున్నా కేంద్రంలోని సర్కార్ ఉపయోగించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నాగ్ పూర్ లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో ఎంత వారైనా మూలాలు మరిచి పోకూడదంటూ హెచ్చరించారు. నితిన్ గడ్కరీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి వ్యక్తి. ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.
ఈ తరుణంలో తాజాగా మరో బాంబు పేల్చారు. తన చిన్ననాడు జరిగిన సంఘటన గురించి ఇవాళ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను నాగ్ పూర్ లో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకుడితో జరిగిన సంభాషణ గురించి వెల్లడించారు.
ఆనాడు కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఆ సమయంలో ఒకరు కాంగ్రెస్ లో చేరాలని సలహా ఇచ్చారని చెప్పారు నితిన్ గడ్కరీ(Nitin Gadkari). తాను విలువలకు కట్టుబడిన వ్యక్తినని, పదవుల కోసం ఏనాడూ ఆశించ లేదని పేర్కొన్నానని తెలిపాడు.
అంతే కాదు బావిలో దూకేందుకు సిద్దంగా ఉన్నానని కానీ పార్టీని , సంస్థను తాను మోసం చేయలేనని చెప్పానని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకున్నారు.
ఒక వ్యక్తి యుద్దంలో ఓడి పోయినప్పుడు కాదు అతను నిష్క్రమించిన సమయంలో పూర్తి అవుతాడని కీలక వ్యాఖ్యలు చేశాడు.
వ్యాపారం, సామాజిక సేవ లేదా రాజకీయాలలో ఎవరికైనా మానవ సంబంధాలే అతి పెద్ద మూలం, బలం అని నితిన్ గడ్కరీ చెప్పారు.
Also Read : రాహుల్ గాంధీకి రాజకీయం తెలియదు