Biden Invite Modi : ప్రధాని మోదీకి జోసెఫ్ బైడెన్ ఆహ్వానం
అమెరికాకు రావాలని విన్నపం
Biden Invite Modi : యుఎస్ చీఫ్ జోసెఫ్ బైడెన్ కీలక ప్రకటన చేశారు. వేసవి పర్యటన కోసం అమెరికాకు రావాల్సిందిగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని(Biden Invite Modi) ఆహ్వానించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది. ఇప్పటికే భారత దేశం శక్తివంతమైన గ్రూప్ జీ20కి నాయకత్వం వహిస్తోంది. అయితే ఎప్పుడు వెళతారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. లాజిస్టిక్ ప్లానింగ్ ప్రారంభ దశలో ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా సెప్టెంబర్ లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి దారి తీసే జీ20కి సంబంధించి భారత దేశం ఈ ఏడాది వరుస కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. దీనికి కూడా అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ కూడా హాజరు కానున్నారు. ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు తేదీలు ఖరారు చేసే పనిలో పడ్డారు.
జూలైలో యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ , సెనేట్ రెండూ సెషన్ లో మాత్రమే కాకుండా ముందుగా నిర్ణయించిన దేశీయ , అంతర్జాతీయ పరంగా సమావేశాలలో పాల్గొనాల్సి ఉంది నరేంద్ర మోదీ. ఈ మధ్య కాలంలో రెండు రోజుల సమయం మాత్రమే ఉంటుంది. యుఎస్ కాంగ్రెస్ ఉమ్మడి సెషన్ లో ప్రసంగం, వైట్ హౌస్ లో విందు కూడా ఉంటుంది.
కాగా గత డిసెంబర్ లో తన మొదటి రాష్ట్ర విందుకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మాక్రాన్ కు ఆతిథ్యం ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు నెలకొల్పేలా చేసేందుకే మోదీని ఆహ్వానిస్తున్నట్లు యుఎస్ ప్రకటించింది.
Also Read : సీఎంకు యూనివర్శిటీ షాక్