Rahul Journalist : రాహుల్ ఇక ప్ర‌శ్నించ‌డా

ఎవ‌రీ జ‌ర్న‌లిస్ట్ ఏమిటా క‌థ‌

Rahul Journalist : ఎవ‌రీ రాహుల్ అనుకుంటున్నారా. సీఎం కేసీఆర్ ప‌దే ప‌దే జపించే ఏకైక పేరు. ఒకే ఒక్క‌డు జ‌ర్న‌లిస్ట్. ఆయ‌న పేరొందిన దిన‌ప‌త్రిక‌కు ప్ర‌ధాన వార్త‌ల‌ను అందిస్తూ వ‌చ్చారు. నిత్యం ప్ర‌శ్న‌ల‌తో సంధించ‌డం, ఇరుకున పెట్ట‌డం నిత్యం జ‌ర్న‌లిస్టుల‌కు మామూలే. వారి వృత్తే అంత‌. కానీ కాక‌లు తీరిన యోధుడిగా, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌చ్చిన నాయ‌కుడిగా, సీఎంగా కొలువు తీరిన క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుతో మాట్లాడాలంటే ద‌మ్ముండాలి. పెన్ లో ప‌వర్ ఉండాలి.

అంత‌కంటే అడిగే ప్ర‌శ్న‌కు సంబంధించి ముందస్తుగా స‌మాచారం తెలుసుకుని ఉంటేనే కేసీఆర్ తో ఢీకొన‌గ‌లం. మ‌రి అంత‌టి ఉద్దండ మేధావి అయిన సీఎంను త‌ట్టుకుని నిల‌బ‌డిన జ‌ర్న‌లిస్టుగా గుర్తింపు పొందారు రాహుల్.

క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న సంధించిన ప్ర‌శ్న‌లు కొంత ఇబ్బందిని క‌లిగించాయి. ఒక్కోసారి రాహుల్(Rahul Journalist) పిచ్చి ప్ర‌శ్న‌లు వేయకు అంటూ కేసీఆర్ కోప్ప‌డిన స‌న్నివేశాలు లేక పోలేదు. ఇదే స‌మ‌యంలో త‌న ఆఫీసుకు స‌చివాల‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉన్నా వ‌చ్చీ కూర్చోమంటూ ఆహ్వానించినా సున్నితంగా తిర‌స్క‌రించిన జ‌ర్న‌లిస్టు రాహుల్.

ఆయ‌న రాసేది ఇంగ్లీష్ ప‌త్రిక‌కే అయిన‌ప్ప‌టికీ రాష్ట్రం ప‌ట్ల చాలా అవ‌గాహ‌న ఉంది. అంత‌కు మించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాల‌న్న సంక‌ల్పం ఆయ‌న‌కు ఉన్న నిబద్ద‌త‌ను తెలియ చేస్తుంది. స‌రిగ్గా మే 31న బుధ‌వారం త‌న పాత్రికేయ వృత్తి నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. సో ఇలా సోష‌ల్ మీడియాలో అగుపించారు.

Also Read : Sunil Kanugolu

 

Leave A Reply

Your Email Id will not be published!