Siddique Kappan : జ‌ర్న‌లిస్ట్ సిద్దిక్ కు ఉగ్ర‌వాదుల‌తో లింక్

ఆరోప‌ణ‌లు చేసిన యూపీ ప్ర‌భుత్వం

Siddique Kappan :  కేర‌ళ‌కు చెందిన జ‌ర్న‌లిస్ట్ సిద్దిక్ క‌ప్ప‌న్ కు ఉగ్ర‌వాదుల‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించింది ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.

ఇదిలా ఉండ‌గా యూపీలోని హ‌త్రాస్ కుట్ర కేసులో సిద్దిక్ క‌ప్ప‌న్ పై యుపా (ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ట్టం ) , ఇత‌ర అభియోగాల కింద కేసు న‌మోదు చేశారు.

హ‌త్రాస్ లో ద‌ళిత మ‌హిళను అత్యాచారానికి పాల్ప‌డి స‌జీవ ద‌హ‌నానికి పాల్ప‌డ్డారు. కాగా సిద్దిక్ క‌ప్ప‌న్ తో పాటు మ‌రికొంద‌రు ప్ర‌త్యేక క‌థ‌నం కోసం క‌వ‌ర్ చేసేందుకు వెళ్లారు.

ద‌గ్గ‌ర లోని టోల్ గేట్ వ‌ద్ద అదుపులోకి తీసుకున్నారు. సిద్దిక్ క‌ప్ప‌న్(Siddique Kappan) కు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ద్ద‌తు ల‌భించింది. బెయిల్ పిటిష‌న్ కు సంబంధించి సెప్టెంబ‌ర్ 9న విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

సుప్రీంకోర్టులో దాఖ‌లు త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ సిద్దిక్ క‌ప్ప‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిని ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీవ్రంగా వ్య‌తిరేకించింది.

ఇదే స‌మ‌యంలో యూపీ గ‌వ‌ర్న‌మెంట్ చ‌ట్ట విరుద్ద కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసింది. తీవ్ర‌వాద సంస్థ పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉన్నాడ‌ని ఆరోపించంది.

విద్యార్థి విభాగం క్యాంప‌స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) వంటి టెర్ర‌ర్ ఫండింగ్ ప్లానింగ్ సంస్థ‌ల‌తో లోతైన సంబంధాలు క‌లిగి ఉన్నారు.

ఈ సంస్థ‌ల‌కు ట‌ర్కీ లోని ఐహెచ్ హెచ్ వంటి అల్ ఖైదా అనుబంధ సంస్థాల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని ఆరోపించింది యూపీ ప్ర‌భుత్వం.  ఇదిలా ఉండ‌గా అంత‌కు ముందు సిద్దిక్ క‌ప్ప‌న్ బెయిల్ పిటిష‌న్ పై యూపీ స‌ర్కార్ ప్ర‌తిస్పంద‌న‌ను కోరింది.

Also Read : మెగా కాంగ్రెస్ యాత్ర‌కు శ్రీ‌కారం

Leave A Reply

Your Email Id will not be published!