Journalists Protest : కేంద్ర సర్కార్ పై జర్నలిస్టుల గుస్సా
న్యూస్ క్లిక్ జర్నలిస్టులపై సోదాలు
Journalists Protest : న్యూఢిల్లీ – న్యూస్ క్లిక్ న్యూస్ పోర్టల్ లో చైనాకు చెందిన నిధులు అందాయని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఢిల్లీలోని జర్నలిస్టులపై మూకుమ్మడి దాడులకు దిగారు పోలీసులు. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ గురువారం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు.
Journalists Protest Viral
ఈ దేశంలో రోజు రోజుకు ప్రజాస్వామ్యం లేకుండా పోతోందని ఆవేదన చెందారు. ఏదైనా ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు . వ్యవస్థలను నిర్వీర్యం చేయడం పనిగా పెట్టుకున్నారంటూ కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు.
న్యూస్ క్లిక్(NewsClick) పూర్తిగా ప్రజల కోసం పని చేస్తోందని, ఎవరూ దేశానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం లేదని పేర్కొన్నారు. మీడియాపై కక్ష కట్టి కేసులు నమోదు చేయడం, నిధుల పేరుతో దాడులకు పాల్పడడం దారుణమన్నారు . న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు గుమి గూడారు.
ప్రభుత్వానికి సపోర్ట్ గా రాస్తే వారిని ఎవరూ ఏమీ అనడం లేదన్నారు. కానీ కొంచెం వ్యతిరేకంగా రాసినా తట్టుకోలేక పోతున్నారని ఆవేదన చెందారు జర్నలిస్టులు.
Also Read : NewsClick Slams : మేం ప్రజాపక్షం ఎవరికీ తలవంచం
