JP Nadda : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) మీడియా మొఘల్ గా భావించే ఈనాడు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావుతో భేటీ అయ్యారు. ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణల పర్వానికి తెర లేపారు.
JP Nadda Meet Ramoji Rao
రామోజీ రావు గంప గుత్తగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రిక, మీడియా, సోషల్ మీడియా అన్నీ పూర్తిగా చంద్రబాబు నాయుడు జపం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఉన్నట్టుండి 45 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీ చీఫ్ , మాజీ సీఎం కు చుక్కలు చూపించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కవడం, ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడంతో ఊహించని షాక్ తగిలింది. మరో వైపు మార్గదర్శి కేసులో రామోజీరావును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసింది సర్కార్. దీంతో ఊపిరి తీసుకోకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు జగన్ రెడ్డి.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఫైబర్ నెట్ కేసుతో పాటు అమరావతి ఇన్నర్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులో నారా లోకేష్ కు సమన్లు ఇచ్చింది. మరో వైపు రామోజీ కూడా అరెస్ట్ కాక తప్పదన్న ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో బీజేపీ జాతీయ చీఫ్ రామోజీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : Pawan Kalyan : అప్పుల కుప్పగా మారిన ఏపీ
