Lahimpur Kheri : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది యూపీలోని లఖింపూర్ ఖేరి కేసు(Lahimpur Kheri ). ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ (Ashish Mishra) మిశ్రా. ఈ ఘటనపై సిట్ ఆధారంగా ఆయనను అరెస్ట్ చేశారు.
దీంతో అలహాబాద్ హైకోర్టు ఆశిష్ కు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాల్ చేస్తూ బాధిత రైతు కుటుంబాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
బాధితుల తరపున ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. వారి తరపున వాదనలు వినిపించారు. ప్రస్తుతం యూపీలో (UP) భారతీయ జనత పార్టీ (BJP) అధికారంలో ఉందని, ప్రధానంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తండ్రి కూడా కేంద్ర కేబినెట్ లో కొలువు తీరి ఉన్నారని దీని వల్ల బాధితుల ప్రాణాలకు రక్షణ లేకుండా ఉందని వాపోయారు.
దీనిపై సీరియస్ గా స్పందించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఆ మేరకు తక్షణమే వారికి రక్షణ కల్పించాలని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా ఆశిశ్ మిశ్రా కేసులకు (Lahimpur Kheri )సంబంధించి యూపీ (Uttar Pradesh) సర్కార్ సుప్రీంకోర్టుకు (Supreme Court) తన అభిప్రాయాన్ని తెలిపింది. నేరం తీవ్రమైనదేనని చెబుతూనే సాక్షులకు భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.
అందువల్ల ఎటువంటి టాంపరింగ్ జరిగే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. ఆశిష్ మిశ్రా (Ashish Mishra) పునరావృత నేరస్థుడు కాదని పేర్కొంది.
ఆయన నేరస్థుడైతే బెయిల్ ఎలా ఇచ్చారంటూ ప్రభుత్వ తరపు లాయర్ మహేష్ జెఠ్మలానీ ప్రశ్నించారు. సిట్ ఇచ్చిన నివేదికపై స్పందించాలని సూచించింది కోర్టు.
దీంతో ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు (Supreme Court) ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దుకు సంబంధించి తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
Also Read : తేజస్వి సూర్య సంచలన కామెంట్స్