Vijay Nair : విజయ్ నాయర్ కు జ్యుడీషియల్ కస్టడీ
మద్యం పాలసీలో సిసోడియాకు సహాయకుడు
Vijay Nair : ఢిల్లీ లిక్కర్ స్కాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) సహాయకుడైన విజయ నాయర్ ను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనను కోర్టులో హాజరు పర్చడంలో జ్యూడీషియల్ కస్టడీకి పంపింది కోర్టు. ఇప్పటికే రిమాండ్ ముగియడంతో గురువారం తిరిగి ఈడీ కోర్టు ముందు హాజరు పర్చింది.
ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో లిక్కర్ స్కాంతో సంబంధం కలిగి ఉన్నవారిని జల్లెడ పట్టింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో విజయ్ నాయర్(Vijay Nair) ను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితుడిగా చేర్చింది. మొత్తం డిప్యూటీ సీఎంతో పాటు 14 మందిని నిందితులుగా చేర్చింది లిక్కర్ స్కాంలో.
కాగా విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ వ్యూహకర్త గా ఉన్నారు విజయ్ నాయర్. అక్టోబర్ 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఢిల్లీ కోర్టు ఇవాళ పంపింది. ఢిల్లీ ప్రభుత్వం తయారు చేసిన మద్యం పాలసీలో కీలకంగా వ్యవహరించారని సీబీఐ స్పష్టం చేసింది. నమోదు చేసిన ఛార్జిషీట్ లో స్పష్టంగా పేర్కొంది కూడా.
ఇదే క్రమంలో సీబీఐ తదుపరి కస్టడీకి రిమాండ్ కు కోరలేదు. ఇకపై పోలీస్ కస్టడీ అవసరం లేదని చెప్పడంతో ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె. నాగ్ పాల్ ఇవాళ విజయ్ నాయర్ ను జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని నిర్ణయించారు. విచారణ సమయంలో విజయ్ నాయర్ సహకరించడం లేదని ఆరోపించింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
Also Read : మాజీ ఎంపీకి మహిళా కమిషన్ సమన్లు