Jupally Krishna Rao : జూపల్లి చేరిక రేపటికి వాయిదా
ఖరారు కాని ఖర్గే అపాయింట్ మెంట్
Jupally Krishna Rao : మాజీ మంత్రి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణా రావుకు టైం అంత కలిసి వచ్చినట్లు అనిపించడం లేదు. ఆయన ఇప్పటికే రాహుల్ , ప్రియాంక గాంధీలను కలిశారు. కానీ ఖమ్మంలో జరిగిన రాహుల్ గాంధీ జన గర్జన సభకు హాజరు కాలేదు. తానే పెద్ద ఎత్తున కొల్లాపూర్ లో సభ పెట్టి చేరుతానని , హై కమాండ్ నుంచి రాహుల్ లేదా ప్రియాంక గాంధీ రావాలని షరతు పెట్టారు జూపల్లి.
Jupally Krishna Rao Joining Delay
దీనికి కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఓకే చెప్పింది తొలుత. ఆ తర్వాత వాయిదా పడుతూ వచ్చింది. పార్టీ పరంగా బిజీ షెడ్యూల్ ఉండడంతో ఏ ఒక్క నేతా ఇటు వైపు చూడడం లేదు. జూలై 24న కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సభ ఉంటుందని టీపీసీసీ ప్రకటించింది. ఆ మేరకు సన్నాహాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ చివరి దశలో ఆమె రావడం లేదని వెల్లడించడంతో వాయిదా పడింది. మరోసారి జూలై 31న కొల్లాపూర్ కు ప్రియాంక వస్తుందని తిరిగి తెలిపారు. దీంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు జూపల్లి కృష్ణా రావు.
తీరా అంతా సర్దుకున్నాక మేడం , రాహుల్ రారంటూ చావు కబురు చల్లగా చెప్పారు. ఇష్టమైతేనే ఢిల్లీకి రావాలని చెప్పడంతో జూపల్లి(Jupally Krishna Rao) హుటా హుటిన ఢిల్లీలో పార్టీలో చేరేందుకు బయలు దేరారు. తీరా హస్తినకు వెళ్లిన మాజీ మంత్రికి నిరాశే మిగిలింది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే అపాయింట్ మెంట్ దొరకక పోవడంతో తన చేరికను రేపటికి వాయిదా వేసుకున్నారు.
Also Read : Jupally Krishna Rao : జూపల్లి చేరిక రేపటికి వాయిదా