Jupally Krishna Rao : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖతం
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao : రాబోయే ఎన్నికల్లో రాచరిక పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. బ/ధవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా జూపల్లి నివాసంలో కలుసుకున్నారు. ఆయన వెంట భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. వారితో పాటు మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జూపల్లి కృష్ణారావుతో(Jupally Krishna Rao) సుదీర్ఘ మంతనాలు జరిపారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు జూపల్లి కృష్ణారావు.
ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. గతంలో మంత్రిగా కూడా పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకమైన పాత్ర పోషించారు. అంతకు ముందు విద్యుత్ కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి నడిచారు. జైలు పాలయ్యారు. ఆనాటి చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పారు. గతంలో ఆయన పాలమూరులో సహకార బ్యాంకులో ఉద్యోగిగా ఉన్నారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు.
కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గతంలో గెలుపొందారు. బీఆర్ఎస్ లో చేరారు. మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ తీరు నచ్చక ఇటీవలే బయటకు వచ్చారు. తనకు మాట్లాడేందుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ పనై పోయిందన్నారు. ఇక ప్రజలు త్వరలోనే సాగనంపాలని డిసైడ్ అయ్యారని పేర్కొన్నారు.
Also Read : Revanth Reddy : అందరు ఒప్పుకుంటేనే చేర్చుకుంటాం
