Jupudi Prabhakar Rao : తెలుగు రాష్ట్రాలకు పట్టిన శని రామోజీ
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు
Jupudi Prabhakar Rao : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుపై నిప్పులు చెరిగారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పట్టిన శని, శకుని రామోజీ రావు అంటూ మండిపడ్డారు. ఆయన వల్ల నష్టం తప్ప మేలు జరిగింది ఏమీ లేదన్నారు.
Jupudi Prabhakar Rao Slams Ramoji Rao
కక్ష సాధింపు ధోరణితో ఏపీ పట్ల వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. నిజమైన దళిత బంధు జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడును ఇదే విషయంపై ఎందుకు ప్రశ్నించ లేదంటూ ప్రశ్నించారు.
అసైన్డ్ భూములకు హక్కులు కల్పించిన ఘనత జగన్ రెడ్డికే దక్కిందన్నారు జూపూడి ప్రభాకర్ రావు(Jupudi Prabhakar Rao). అసైన్డ్ భూములను ఆక్రమించి రామోజీ రావు ఫిల్మ్ సిటీని కట్టలేదా అని నిలదీశారు. దళితులు గనుక కళ్లు తెరిస్తే ఫిల్మ్ సిటీ ఉండదన్నారు.
పేదోళ్ల బిడ్డలకు ఇంగ్లీష్ విద్యను అడ్డుకున్నది మీ కుల దుర అహంకారం కాదా అన్నారు. ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి తెలంగాణలో ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక నారదుడిగా, శకుని పాత్రలు పోషిస్తున్న పత్రిక ఏదైనా ఉందంటే అది ఈనాడు దినపత్రిక అన్నారు జూపూడి ప్రభాకర్ రావు.
Also Read : TTD Board Member : లిక్కర్ స్కామ్ అప్రూవర్ టీటీడీ మెంబర్