TS CM KCR : ప్రజాస్వామ్యాన్ని న్యాయవ్యవస్థ కాపాడాలి – కేసీఆర్
ఢిల్లీ..తెలంగాణ..బెంగాల్..ఏపీని పడగొడతారట
TS CM KCR : దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. దీనిని కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా న్యాయ వ్యవస్థపై ఉందన్నారు సీఎం కేసీఆర్. మోదీ ప్రభుత్వం కొలువు తీరాక ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. బీజేపీ దుర్మార్గపు చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు.
ప్రగతి భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. అపారమైన వనరులను అప్పనంగా కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలకు కట్టబెట్టారంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయంలో మొత్తం కాషాయం బండారం బయట పడిందన్నారు.
ఇందుకు సంబంధించి వీడియోను మీడియా సాక్షిగా ప్రదర్శించారు కేసీఆర్(TS CM KCR). ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేస్తామనడం దారుణమన్నారు. ఇప్పటి వరకు దేశంలోని ప్రభుత్వేతర ఎనిమిది రాష్ట్రాలను కూల్చి వేశారని మండిపడ్డారు. మొన్నటికి మొన్న ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నం చేశారని కానీ వర్కవుట్ కాలేదన్నారు సీఎం.
ఇదే ఆపరేషన్ ను ప్రస్తుతం ఢిల్లీలో ఆప్, పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్ర ప్రదేశ్ లో వైస్సార్సీపీ పార్టీల ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చే పనిలో పడ్డాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలకు, న్యాయ వ్యవస్థకు అందజేయడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా అన్ని పార్టీల చీఫ్ లకు కూడా పంపించామన్నారు కేసీఆర్.
భారతీయ జనతా పార్టీ అత్యంత దిగజారి ప్రవర్తిస్తోందంటూ ఆరోపించారు సీఎం. సీఎం చేసినకామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : కాషాయం దేశానికి ప్రమాదం – కేసీఆర్