Jyotiraditya Scindia : మాజీ సీఎంల పట్ల కోపం లేదు
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
Jyotiraditya Scindia : న్యూఢిల్లీ – కేంద్ర పౌర విమానయాన సంస్థ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరి పట్ల ద్వేషం అంటూ ఉండదన్నారు. కొందరు తన పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ చేస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు.
Jyotiraditya Scindia Comments Viral
తాను ఎప్పుడూ చిల్లర రాజకీయాలు చేయలేదన్నారు. అంత సీన్ కూడా లేదన్నారు. తమ వంశం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. భావ సారూప్యత కలిగిన వారితో తాను మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
మధ్య ప్రదేశ్ లో మాజీ సీఎంలు , కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్ నాథ్ , దిగ్విజయ్ సింగ్ పట్ల ఎలాంటి కోపం కానీ అలాగేనీ ప్రేమ కూడా లేదన్నారు. ప్రతి ఒక్కరి పట్ల తనకు గౌరవ భావం ఉంటుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
అందుకే కాంగ్రెస్ పార్టీ లేదా విపక్షాలతో కూడిన ఇండియా కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము తిరిగి పవర్ లోకి వస్తామని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు . వాళ్లు కలలు కంటున్నారని అది వారి హక్కు అని , దానిని తామెందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు.
Also Read : Asia Cup 2023 : PAK vs SL ఆసియా కప్ ఫైనల్ కు శ్రీలంక