K Annamalai : వైరముత్తుపై అన్నామలై కామెంట్స్
ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్న
K Annamalai : ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై. ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని, మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు విమర్శలు వచ్చినా ఎందుకని డీఎంకే ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో మహిళా రెజ్లర్ల గురించి స్టాలిన్ ప్రస్తావించడం, అదే సమయంలో నూతన పార్లమెంట్ లో రాజ దండం గురించి కామెంట్స్ చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజ దండం వంగి పోయిందంటూ మండిపడ్డారు సీఎం స్టాలిన్ . దీనిపై తీవ్రంగా స్పందించారు అన్నామలై(K Annamalai).
గతంలో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేశారు. గీత రచయిత వైరముత్తు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ బహిరంగంగానే ప్రకటించింది. అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనం రేగింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ధైర్యంగా ముందుకు వచ్చి కామెంట్స్ చేసిన చిన్మయికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ తరుణంలో తాజాగా గాయని చేసిన ఆరోపణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు బీజేపీ చీఫ్ వైరముత్తు.
ఎందుకని ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు సీఎంను. వైరముత్తును అరెస్ట్ చేయాల్సి ఉండగా ఆయనను రక్షిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నామలై. ప్రస్తుతం బీజేపీ చీఫ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు పేరరసు వైరముత్తు. గాయని చిన్మయితో సహా ఆయనపై 19 లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని ఆరోపించారు.
Also Read : MK Stalin
