K Annamalai : డీఎంకే ప్రభుత్వం అవినీతిమయం
తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై
K Annamalai : తమిళనాడు డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై. పూర్తిగా అవినీతికి కేరాఫ్ గా మారిందని ఆరోపించారు. ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ప్రస్తుత సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా హక్కుల నిధుల పేరుతో షెడ్యూల్డ్ వర్గాలకు చెందిన సోదర, సోదరీమణుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను దుర్వినియోగం చేసిందంటూ ధ్వజమెత్తారు.
K Annamalai Comments
వారి అభ్యున్నతి కోసమని కేటాయిస్తే , తిరిగి నిధులను కేంద్రానికి పంపించడం దారుణమన్నారు కె. అన్నామలై(K Annamalai). ఒక రకంగా డీఎంకే ప్రభుత్వ అసమర్థతను తెలియ చేస్తుందన్నారు. షెడ్యూల్డ్ కమ్యూనిటీకి సంబంధించి పాఠశాలలు, హాస్టళ్లను మెరుగు పర్చడం, హింసకు లోనైన బాధితులకు పరిహారం ఇచ్చేందుకు ఉద్దేశించిన నిధులను ఎందుకు ఖర్చు చేయలేదంటూ డీఎంకే సర్కార్ ను ప్రశ్నించారు కె. అన్నామలై.
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రానికి రూ. 10 వేల కోట్లను మంజూరు చేసిందన్నారు. ఇవి కేవలం సెడ్యూల్డు కులాలు, తెగలకు సంబంధించినవే ఉన్నాయని పేర్కొన్నారు. కొత్తగా నిధులు కేటాయించక పోవడం దారుణమన్నారు కె. అన్నామలై. ఇదిలా ఉండగా అన్నామలై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Also Read : AP CM YS Jagan : ఏపీ సీఎం జగన్ వైజాగ్ టూర్