K Annamalai : అవినీతిమయం డీఎంకే ప్రభుత్వం
నిప్పులు చెరిగిన బీజేపీ స్టేట్ చీఫ్
K Annamalai : భారతీయ జనతా పార్టీ తమిళనాడు చీఫ్ కె. అన్నామలై నిప్పులు చెరిగారు. ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోని శివగంగ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున జనం నీరాజనం పలికారు ఈ యువ నాయకుడికి. ఆయన తన మాటల తూటాలను ప్రస్తుత డీఎంకే సర్కార్ పై పేల్చుతున్నారు. ప్రధానంగా సీఎం ఎంకే స్టాలిన్ ను టార్గెట్ చేశారు.
K Annamalai Comments
సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, గతంలో ఎన్నడూ లేనంతగా అవినీతి చోటు చేసుకుందంటూ సంచలన ఆరోపణలు చేశారు కె. అన్నామలై(K Annamalai). కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను రాష్ట్రానికి మంజూరు చేసిందని, వాటిని ఇతర పథకాలకు, కార్యక్రమాలకు డీఎంకే సర్కార్ ఉపయోగించిందని మండిపడ్డారు.
నిధులు కేంద్రానివి అయితే సోకు, ప్రచారం మాత్రం స్టాలిన్ చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు కె. అన్నామలై. ఇప్పటికే తాను రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతికి సంబంధించి ఆధారాలతో సహా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి అందజేశానని చెప్పారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని, చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు.
Also Read : TSRTC Bill : ఆర్టీసీ విలీనంపై అసెంబ్లీలో బిల్లు