K Annamalai : ఉదయనిధిపై అన్నామలై ఫైర్
బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే
K Annamalai : తమిళనాడు యువజన శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై నిప్పులు చెరిగారు బీజేపీ స్టేట్ చీఫ్ కె. అన్నామలై. తాజాగా చెన్నై వేదికగా రచయితల సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఉదయనిధి స్టాలిన్.
K Annamalai Comments on Udayanidhi Stalin
సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి. సనాతన ధర్మం అనేది ఇవాళ మనుషులను కులం పేరుతో, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక రకంగా డెంగ్యూ, మలేరియా వ్యాధి లాంటిదని పేర్కొన్నారు. దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడటం కంటే పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు ఉదయనిధి స్టాలిన్.
తాజాగా మంత్రి చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మరో వైపు ఉదయనిధి స్టాలిన్ కు ప్రజాస్వామిక, అభ్యుదయ, విప్లవ సంస్థలకు చెందిన కవులు, కళాకారులు, రచయితలు, రచయితలు మద్దతు పలికారు.
బీజేపీ స్టేట్ చీఫ్ కె. అన్నామలై(K Annamalai), బీజేపీ జాతీయ ఐటీ చీఫ్ అమిత్ మాల్వియా తో పాటు ఇతర హిందూ సంస్థల ప్రతినిధులు భగ్గుమన్నారు ఉదయనిధి స్టాలిన్ పై. ఆయనపై కేసు నమోదు చేయాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : Udayanishi Stalin : సనాతన ధర్మం అత్యంత ప్రమాదం