K Atchennaidu : గుంటూరు – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలని టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏపీ స్కిల్ స్కాంలో ఇరికించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో తమ నాయకుడికి మద్దతు ఇవ్వడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
K Atchennaidu Slams YS Jagan
చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లోలోపట సంతోషం చెందుతున్నారని కానీ బాబుకు మద్దతు తెలిపే వారిని చూసి జడుసుకుంటున్నారని మండిపడ్డారు. ఇందుకు జగన్ రెడ్డి సిగ్గు పడాలని అన్నారు.
అధికార బలంతో ర్యాలీలను అడ్డుకోవచ్చేమో కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం అడ్డుకోవడం జగన్ రెడ్డి తాత వల్ల కాదని హెచ్చరించారు కింజారపు అచ్చెన్నాయుడు(K Atchennaidu).చంద్రబాబు నాయుడుకు దేశ వ్యాప్తంగా వస్తున్న మద్దతును చూసి విస్తు పోతున్నారంటూ ఎద్దేవా చేశారు.
కావాలని ఐటీ ఉద్యోగుల మద్దతును, బాబు కోసం వస్తున్న ర్యాలీలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. సామాన్య ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : BCCI Selection : సూర్యపై ప్రేమ సంజూపై కక్ష