K Lakshman : తిరుమ‌ల వెంక‌న్న నిధులు దుర్వినియోగం

ఎంపీ డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

K Lakshman : తిరుమ‌ల – భార‌తీయ జ‌న‌తా పార్టీ రాజ్య స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌ణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తిరుమ‌ల‌లో కొలువైన వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ఆయ‌న ద‌ర్శించుకున్నారు. అనంత‌రం వెంగ‌మాంబ అన్న‌దాన స‌త్రంలో సామాన్య భ‌క్తుడి లాగా కూర్చుని భోజ‌నం చేశారు. అనంత‌రం డాక్ట‌ర్ కె. ల‌క్ష్మ‌ణ్ మీడియాతో మాట్లాడారు.

K Lakshman Comments Viral

తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ప‌ని తీరుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. భ‌క్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని ద‌ర్శించు కుంటార‌ని , కోట్లాది రూపాయ‌లతో పాటు భారీ ఎత్తున బంగారం, వెండి, విరాళాల రూపేణా టీటీడీకి వ‌స్తోంద‌ని వీటిని ఏం చేస్తుందో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌ణ్‌.

వెంకన్న నిధులు పక్కదారి పడుతున్నాయని, భక్తుల విరాళాలు దేవుడి కైంకర్యాలకు వినియోగించాలని కోరారు. ప్రాచీన కట్టడాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఎంపీ లక్ష్మణ్‌(K Lakshman). తిరుపతి అభివృద్ధికి ప్రభుత్వ నిధులనో లేక నగర పాలిక నిధులను వినియోగించాలని కోరారు.

తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నార‌ని, 20 శాతానికి పైగా బీజేపీ ఓట్లు సాధిస్తుందన్నారు. రానున్న తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 90 శాతం లోక్ సభ సీట్లు బిజెపి గెలుస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

Also Read : Telangana Elections 2023 : తెలంగాణ‌లో టెన్ష‌న్ టెన్ష‌న్

Leave A Reply

Your Email Id will not be published!