K Laxman : రైతన్నల ఆగ్రహం పతనం ఖాయం
సీఎం కేసీఆర్ పై లక్ష్మణ్ ఫైర్
K Laxman : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ సంయుక్త కార్యాచారణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం బంద్ కు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. తమ అనుమతి లేకుండా భూములను తీసుకునే హక్కు ఎవరికి ఇచ్చారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే మేలు చేస్తోందంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా రైతులను ఇబ్బంది పెట్టడం సీఎం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ లక్ష్మణ్(K Laxman). ఇప్పటికే ప్లాన్ ను నిరసిస్తూ ఓ రైతు సూసైడ్ చేసుకోవడం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.
రైతు చని పోతే పరామర్శించాల్సింది పోయి మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడటం దారుణమన్నారు. రైతులంటే అంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు ఎంపీ. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ ను ఎలా తయారు చేస్తారంటూ నిలదీశారు లక్ష్మణ్(K Laxman). ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ మరింత ముందుకు వెళుతుందన్నారు.
కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అనే నినాదంతో తాము ముందుకు వెళతామని చెప్పారు లక్ష్మణ్. వచ్చే ఏప్రిల్ లో రాష్ట్ర సర్కార్ పై కేంద్ర మంత్రి అమిత్ షా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారని స్పష్టం చేశారు.
రానున్న సంక్రాంతి పండుగ తర్వాత మేధావుల సమ్మేళనం నిర్వహిస్తామని స్పష్టం చేశారు లక్ష్మణ్. జిల్లా స్థాయిలో భారీ సభలు, 10 వేల గ్రామ సభలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణను కాపాడుకునేందుకు కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Also Read : సర్కార్ పై రైతన్నల కన్నెర్ర