KA Paul : పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ – పాల్
ప్రజా శాంతి పార్టీ చీఫ్ కామెంట్
KA Paul : హైదరాబాద్ – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై మరోసారి నిప్పులు చెరిగారు ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా ఏ ఒక్కరు కూడా మాట్లాడటం లేదన్నారు. తనకు ఒక న్యాయం చంద్రబాబు నాయుడికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు.
KA Paul Comments Viral
పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పార్టీ పెట్టలేదన్నారు. కేవలం డబ్బులు సంపాదించేందుకు మాత్రమే పెట్టాడంటూ సంచలన ఆరోపణలు చేశారు కేఏ పాల్(KA Paul). ఓ వైపు కేంద్రం ఏపీకి తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెడుతుంటే ఒక్కడు కూడా నోరు మెదపలేదన్నారు.
ఇదే అంశంలో జేడీ లక్ష్మీనారాయణ ఒక్కరే ముందుకు వచ్చారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారా అని ప్రశ్నించారు. కేవలం తమ ఆస్తులను కాపాడు కోవడానికి మాత్రమే పార్టీని నడుపుతున్నారంటూ మండిపడ్డారు కేఏ పాల్.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తాను ఉద్యమిస్తే అకారణంగా తనను అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడికి సరైన శిక్ష ఇంకా పడలేదన్నారు. ఇక ప్యాకేజీ స్టార్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు కేఏ పాల్.
ఎన్ని డబ్బులు తీసుకున్నావో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జన సైనికులు ఇప్పటికైనా పవన్ ను నమ్మకండి అని, వెంటనే ప్రజా శాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.
Also Read : Chandrababu Naidu : చంద్రబాబుకు హైకోర్టు బిగ్ షాక్