KA Paul : పాప పుడితే ప్ర‌చారమా – కేఏ పాల్

చిరంజీవి ఫ్యామిలీపై సెటైర్లు

KA Paul : ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్, ప్ర‌ముఖ మ‌త ప్ర‌చార‌క‌ర్త కేఏ పాల్ నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మెగా స్టార్ ఫ్యామిలీని ఏకి పారేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల‌లో స‌మ‌స్య‌లు లేవ‌న్న‌ట్లు రామ్ చ‌ర‌ణ్ , ఉపాస‌న‌కు పాప పుడితే చ‌ర్చించేలా చేశార‌ని ఇదేమి దౌర్భాగ్యం అంటూ మండిప‌డ్డారు. ఆయ‌న మంత్రిగా ఉన్నప్పుడు బీసీల‌కు , బ‌హుజ‌నుల‌కు ఏం చేశారో చెప్పాలంటూ చిరంజీవిని నిల‌దీశారు కేఏ పాల్(KA Paul).

ప్ర‌తి దానిని ప్ర‌చారం చేసుకోవాల‌నుకునే దానిని ఎంత త‌గ్గించుకుంటే అంత మంచిద‌ని సూచించారు మెగా ఫ్యామిలీకి. దాని బ‌దులు స‌మాజానికి ఏదో మంచి ప‌ని చేస్తే బెట‌ర్ అని పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కూడా సెటైర్లు విసిరారు. ఆయ‌న ప్యాకేజీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను ఏం మాట్లాడుతున్నాడో త‌న‌కే తెలియ‌ద‌న్నారు.

తాను ప్ర‌స్తుతం అప్పుల్లో ఉన్నాన‌ని పేర్కొన్నారు. త‌న చారిటీ సంస్థ‌ల‌కు సంబంధించిన లావాదేవీల‌ను పూర్తిగా నిలిపి వేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినా తాను ప్ర‌జాశాంతి పార్టీ త‌ర‌పున పోరాటం చేస్తూనే ఉన్నాన‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేస్తే త‌గ‌దున‌మ్మా అంటూ జ‌గ‌న్ కూడా 5 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేశాడ‌ని దీనిని ఎవ‌రు భ‌రించాల‌ని ప్ర‌శ్నించారు కేఏ పాల్.

Also Read : Komatireddy Venkat Reddy : డీకేతో కోమ‌టిరెడ్డి భేటీ

 

Leave A Reply

Your Email Id will not be published!