KA Paul : వికాస్ రాజ్ పై సీజేఐకి ఫిర్యాదు

షాకింగ్ కామెంట్స్ చేసిన కేఏ పాల్

KA Paul : హైద‌రాబాద్ – ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్(KA Paul) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి వికాస్ రాజ్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఈవో ఒక పెద్ద డ్రామా న‌డుపుతున్నాడంటూ ఆరోపించారు.

KA Paul Complaint to CEO

వికాస్ రాజ్ పూర్తిగా బాధ్య‌తా రాహిత్యంతో ఎన్నిక‌లు నిర్వ‌హించారని, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ కు ఫిర్యాదు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

గ‌త నెల నవంబ‌ర్ 30న రాత్రి తుంగ‌తుర్తిలో ఈవీఎంలు క‌నిపించ‌డం లేద‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలోని 30 స్థానాల‌కు సంబంధించి ఈవీఎలు క‌నిపించ‌కుండా పోయాయ‌ని దీనికి ప్ర‌ధాన కార‌కుడు వికాస్ రాజ్ అంటూ ఆరోపించారు కేఏ పాల్.

అన్ని స‌ర్వే సంస్థ‌ల‌న్నీ గంప గుత్త‌గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తున్నాయ‌ని చెబుతున్నాయ‌ని , ఇదే స‌మ‌యంలో ఆ పార్టీకి చెందిన అభ్య‌ర్థుల‌తో దొంగ‌చాటుగా కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నార‌ని ఇది త‌న దాకా కూడా వ‌చ్చింద‌ని ఎన్నిక‌ల సంఘం ఏం ప‌ని చేస్తోందంటూ ప్ర‌శ్నించారు డాక్ట‌ర్ కేఏ పాల్.

Also Read : Madhu Yashki Goud : క‌ల్వ‌కుంట్ల దొంగ‌ల‌ను వ‌దిలి పెట్టం

Leave A Reply

Your Email Id will not be published!