KA Paul : చంద్రబాబు నిర్వాకం కందుకూరు విషాదం
ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కామెంట్స్
KA Paul : ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఆయన నిర్వాకం కారణంగానే సామాన్య కార్యకర్తలు చని పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వయస్సు మీద పడినా ఇంకా రాజకీయ వ్యామోహం తగ్గలేదన్నారు.
రాష్ట్రం పూర్తిగా రావణ కాష్టంలా మారిందంటూ మండిపడ్డారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాల్సింది నారా చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం కేఏ పాల్(KA Paul) డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసేందుకు అని వెళ్లారు. కానీ ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
ముందుగా అపాయింట్మెంట్ తీసుకోలేదని, అందుకే తాము పర్మిషన్ ఇవ్వబోమంటూ స్పష్టం చేశారు కేఏ పాల్ కు. ముందుగానే డీజేపీకి సమాచారం ఇచ్చినా తనకు అనుమతి ఇవ్వక పోవడం దారుణమన్నారు. తనను అకారణంగా వాహనాన్ని అడ్డుకున్నారంటూ వాపోయారు.
తాను ఎంతో మందితో సభ నిర్వహించినా ఒక్కరు కూడా చని పోలేదని కానీ బాబు సభలో ఎనిమిది మంది చని పోవడం బాధాకరమన్నారు. వెంటనే చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కేఏ పాల్(KA Paul) డిమాండ్ చేశారు. కందుకూరు ఘటనకు బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.
పదవిపై ఉన్నంత ప్రేమ ప్రజలపై ఏనాడూ లేదని చంద్రబాబును టార్గెట్ చేశారు ప్రజా శాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : ఊపిరి ఆగింది గుండె పగిలింది