Kaavaalaa Song : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్, లవ్లీ గర్ల్ తమన్నా భాటియా కలిసి నటించిన జైలర్ మూవీకి భారీ ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే మూవీకి సంబంధించి విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ , సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
తాజాగా జైలర్ కు సంబంధించి కావాలా పాట(Kaavaalaa Song) ఇప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగ రాస్తోంది. రోజు రోజుకు దూసుకు పోతోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. అరుణ్ రాజా కామ రాజ్ సాహిత్యం అందించారు. కావాలా పాటను శిల్పా రావు, అనిరుధ్ రవచంద్రన్ పాడారు.
యూట్యూబ్ , ఇన్ స్టా గ్రామ్ లలో కావాలా సాంగ్ టాప్ లో నిలిచింది. ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇప్పటి వరకు టాప్ లో కొనసాగిన జోసెఫ్ విజయ్ నటించిన లియో ఫిలింకు చెందిన నా రెడీ పాటను దాటేసింది జైలర్ కావాలా సాంగ్.
అంతే కాదు ఈ సాంగ్ 2023లో అత్యంత జనాదరణ కలిగిన పాటల్లో నెంబర్ 1గా నిలిచింది. మొత్తంగా మరోసారి సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టామినా ఏమిటో చూపించాడు. ఇక తమన్నా బాటియా కావాలా సాంగ్ లో లీనమై నటించింది.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు
